NATO: అణుయుద్ధం భయాల వేళ.. అణ్వస్త్ర విన్యాసాలను మొదలుపెట్టిన నాటో
రష్యా అణుయుద్ధం భయాల వేళ నాటో దేశాలు అణ్వస్త్ర విన్యాసాలను మొదలుపెట్టాయి.
బ్రసెల్స్: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోన్న రష్యా.. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ఇందులో భాగంగా సైనిక సమీకరణ ముమ్మరం చేయడంతో పాటు అణ్వాయుధాల అస్త్రాన్ని వినియోగించే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తోన్న నాటో.. తాజాగా అణ్వస్త్ర విన్యాసాలను మొదలుపెట్టింది.
30సభ్య దేశాలున్న నాటో కూటమి.. వార్షిక అణ్వస్త్ర విన్యాసాలను యూరప్ తూర్పు తీరంలో నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 14 నాటో దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. రష్యాకు సుమారు వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఈ అణ్వస్త్ర విన్యాసాలు జరగనున్నాయి. 60 యుద్ధ విమానాలతోపాటు పర్యవేక్షణ, ఇంధనం నింపే విమానాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. వీటితోపాటు అమెరికాకు చెందిన లాంగ్ రేంజ్ బీ-52 బాంబర్లు కూడా ఈ విన్యాసాల్లో భాగస్వామ్యం కానున్నాయని నాటో వెల్లడించింది. అక్టోబర్ 30 వరకు ఈ వార్షిక అణ్వస్త్ర విన్యాసాలు జరుగుతాయి.
ఇలాంటి అణ్వస్త్ర విన్యాసాలను రష్యా కూడా సాధారణంగా ఇదే సమయంలో చేపడుతుంది. నాటో దేశాలు వీటిని మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ నెలలోనే రష్యా కూడా వీటిని మొదలుపెట్టవచ్చని నాటో అంచనా వేస్తోంది. మరోవైపు, యుద్ధంలో గెలుపు దక్కే అవకాశాల్లేకపోతే.. తప్పనిసరి పరిస్థితుల్లో పుతిన్ అణ్వస్త్రాలను బయటకు తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వార్షిక అణ్వస్త్ర విన్యాసాలకు నాటో మొదలుపెట్టడం కూడా పుతిన్‌కు మరింత ఆగ్రహం కలిగించే విషయంగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్