Ukraine crisis: తక్షణమే యుద్ధం ఆపండి: నాటో విజ్ఞప్తి

ఉక్రెయిన్‌లో తక్షణమే రష్యా తన సైనిక చర్యను నిలిపివేయాలని, తన బలగాలన్నింటినీ వెనక్కి రప్పించాలని నాటో ....

Published : 01 Mar 2022 23:50 IST

లాస్క్‌ ఎయిర్‌బేస్‌: ఉక్రెయిన్‌లో తక్షణమే రష్యా తన సైనిక చర్యను నిలిపివేయాలని, తన బలగాలన్నింటినీ వెనక్కి రప్పించాలని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ కోరారు. ఈ యుద్ధంలో పాల్గొనాలనే ఆలోచన తమకు లేదని.. ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ కూటమి దళాలను, యుద్ధ విమానాలను పంపబోదన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడాతో సెంట్రల్‌ పోలండ్‌లోని లాస్క్‌ ఎయిర్‌ బేస్‌లో నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ సమావేశమయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలపై చర్చించారు. ఎఫ్‌ -16లతో పాటు పోలండ్‌, నాటో ఫైటర్‌ జెట్‌లు ఉన్న లాస్క్‌లోని 32వ వ్యూహాత్మక ఎయిర్‌ బేస్‌ వద్ద ఈ ఉదయం ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాటో చీఫ్‌ మాట్లాడుతూ.. ‘నాటో ఓ రక్షణ కూటమి. రష్యాతో మేం విభేదాలు కోరుకోం. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాలి. తమ బలగాలను తక్షణమే వెనక్కి పిలిపించాలి. దౌత్య ప్రయత్నాలతో సమస్య పరిష్కారానికి ముందు ముందడుగు వేయాలి’ అని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని