Ukraine: ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: నాటో
ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో.. సైనిక, మానవతా సాయం అందించే అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నాటో కూటమి పేర్కొంది.
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో.. సైనిక, మానవతా సాయం అందించే అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నాటో కూటమి పేర్కొంది. యుద్ధం ఎంత సుదీర్ఘకాలం సాగినా, తాము ఆ దేశానికి అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. త్వరలో నాటో విదేశాంగమంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంలో నాటో ప్రమాణాలకు అనుగుణంగా ఉక్రెయిన్ సైన్యాన్ని ఆధునికీకరిస్తామని అన్నారు. రష్యాతో చర్చలు చేయాలని కూడా తాము ఉక్రెయిన్‌పై ఒత్తిడి తేవడం లేదని తెలిపారు. ‘‘చాలా యుద్ధాలు చర్చలతో ముగుస్తాయి. కానీ చర్చల్లో ఏం జరుగుతుందన్నది యుద్ధక్షేత్రంలోని పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల శాంతియుత పరిష్కారానికి అవకాశాలు పెంచటానికి ఉత్తమ మార్గం ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడమే’’ అని స్టొల్టెన్‌బర్గ్ చెప్పారు.
* శీతాకాలాన్ని ఆయుధంగా వాడుతూ.. ఉక్రెయిన్ ప్రజల జీవితాలను రష్యా దుర్భరంగా మారుస్తోందని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. శుక్రవారం ఆయన కీవ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు 60 మిలియన్ డాలర్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థను అందిస్తామని హామీ ఇచ్చారు.
* మరోవైపు ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంపై రష్యా తన దాడులను ఉద్ధృతం చేసింది. శుక్రవారం జరిపిన వైమానిక, క్షిపణి దాడుల్లో ఖేర్సన్‌లో 10 మంది పౌరులు మృతి చెందారు.
* ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల మాతృమూర్తులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిశారు. ఈ సందర్భంగా నకిలీ వార్తలను నమ్మవద్దని వారిని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sitara: మహేశ్ తనయ మంచి మనసు.. ఫిదా అవుతోన్న నెటజన్లు
-
Asian Games: గోల్ఫ్‌లో రజతం.. అదితి అశోక్ రికార్డు
-
Pakistan: ‘బలూచిస్థాన్ పేలుళ్ల వెనుక రా హస్తం’: పాక్ మంత్రి ఆరోపణలు
-
S Jaishankar: భారత్-అమెరికా బంధానికి హద్దుల్లేవు: ఎస్. జైశంకర్
-
YS Bhaskar reddy: ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని భాస్కర్ రెడ్డి పిటిషన్
-
Kiran Abbavaram: మాటిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తా: కిరణ్ అబ్బవరం