War Cabinet: ‘వార్‌ క్యాబినెట్‌ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!

హమాస్‌పై పోరులో భాగంగా బలగాలకు ఆదేశాలు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించిన వార్‌ క్యాబినెట్‌ను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు రద్దు చేసినట్లు సమాచారం.

Published : 17 Jun 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ (Isrele) సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. యుద్ధ క్షేత్రంలో తమ బలగాలకు సరైన ఆదేశాలు జారీ చేయడంలో ఇజ్రాయెల్‌ వార్‌ క్యాబినెట్‌ (Israel War Cabinet)ది కీలక పాత్ర. అయితే.. దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తాజాగా ఈ క్యాబినెట్‌ను రద్దు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్‌, గాడీ ఐసెన్‌కోట్‌లు ఇటీవల దీన్నుంచి బయటకు వచ్చేసిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడులకు పాల్పడింది. దీంతో టెల్‌అవీవ్‌ సైతం ప్రతిదాడులు మొదలుపెట్టింది. యుద్ధ సమయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఐక్యత ప్రదర్శించేందుకుగానూ బెన్నీ గాంట్జ్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష నేషనల్‌ యూనిటీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే అదే నెల 11న నెతన్యాహు, గాంట్జ్‌సహా ఆరుగురు సభ్యులతో ‘వార్‌ క్యాబినెట్‌’ ఏర్పాటయ్యింది. గాజాలో యుద్ధంపై ఇది కీలక నిర్ణయాలు తీసుకుంది.

2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక

అయితే.. నెతన్యాహు యుద్ధాన్ని నడిపిస్తోన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గాంట్జ్‌ ఇటీవల ప్రభుత్వం నుంచి వైదొలిగారు. యుద్ధానంతర ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు చెప్పారు. మరోవైపు.. బందీల విడుదలకు బదులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోన్న కొంతమంది ప్రభుత్వ నేతల వల్ల నెతన్యాహు ప్రభావితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని ఖండించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని