Neuralink: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్.. న్యూరాలింక్ ప్రయోగాలకు గ్రీన్‌సిగ్నల్
మానవ మెదడులో ఎలక్ట్రానికి చిప్ అమర్చి (Brain implants) చేసే ప్రయోగాల కోసం న్యూరాలింక్ (Neuralink) సంస్థకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ ఆమోదం తెలిపింది.
శాన్ ఫ్రాన్సిస్కో: మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి (Brain implants) చేసే ప్రయోగాల విషయంలో మరో ముందడుగు పడింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ సంస్థ న్యూరాలింక్ (Neuralink)కు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ ఆమోదం తెలిపింది. దీంతో కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (బీసీఐ) ప్రయోగాలకు మార్గం సుగమమైంది.
‘మానవుల్లో క్లినికల్ ప్రయోగాలను చేపట్టేందుకు ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని చెప్పడం సంతోషంగా ఉంది. తమ బృందం అద్భుతమైన పనితీరుకు ఇది నిదర్శనం’ అని న్యూరాలింక్ వెల్లడించింది. ఈ ప్రయోగాల కోసం త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. క్లినికల్ ప్రయోగాలకు అనుమతి రావడంపై న్యూరాలింక్‌కు ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు.
కృత్రిమ మేధ (AI)పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తుందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్’ వీడియో గేమ్‌ను ఆడిన విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో మానవుల్లోనూ ప్రయోగాలకు ప్రయత్నాలు జరపగా.. తాజాగా వాటికి ఆమోదం లభించింది.
మరోవైపు మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ చిప్‌లను అమర్చడంపైనా న్యూరాలింక్ (Neuralink) పరిశోధనలు చేస్తోంది. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్‌ను రూపొందిస్తున్నామని తెలిపింది. అలాగే చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండింటిలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని న్యూరాలింక్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్‌టికెట్లు విడుదల
-
India News
Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
-
Movies News
keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి