
Covid Vaccine: కరోనాపై మొక్కల ఆధారిత అడ్జువెంట్ టీకాలు సమర్థవంతమే..!
కొత్త వ్యాక్సిన్ రూపొందించిన కెనడా శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మొక్కల ఆధారంగా రూపొందించిన అడ్జువెంట్ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా పలు వేరియంట్లను నిరోధించడంలో దాదాపు 70శాతం ప్రభావశీలత చూపించినట్లు తేలింది. మొక్కల ఆధారంగా నూతనంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను మనుషులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తాజా అధ్యయనం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (NEJM)లో ప్రచురితమైంది.
మొక్కల్లో ఉత్పత్తి అయ్యే కరోనా వైరస్ వంటి కణాల (CoVLP)సహాయంతో కెనడియన్ బయోటెక్నాలజీ కంపెనీ మెడికాగోకు చెందిన పరిశోధకులు ఓ టీకా రూపొందించారు. వ్యాక్సిన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు వాటికి సహాయ ఔషధం (ASO3)ని కలిపారు. ఇలా రూపొందించిన వ్యాక్సిన్ (CoVLP+ASO3) తుది దశ ప్రయోగాలను 85 కేంద్రాల్లో 24,141 మంది వాలంటీర్లపై నిర్వహించారు. అనంతరం పరిశీలించగా వారిలో 165 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. తద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ 69.5శాతం ప్రభావశీలత చూపించిందనే నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఓ మోస్తారు నుంచి తీవ్ర వ్యాధిని నిరోధించడంలో మాత్రం 78శాతం సమర్థత చూపినట్లు గుర్తించారు.
అయితే, పరిమిత సంఖ్యలో వాలంటీర్లను నమోదు చేసుకున్నందున 65 ఏళ్ల వయసు పైబడిన వారిపై ఈ టీకా సామర్థ్యాన్ని అంచనా వేయలేదని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ యువకులు, వృద్ధుల్లో వ్యాక్సిన్ ప్రతిస్పందన ఒకే విధంగా ఉందని మునుపటి ప్రయోగ ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు. ఏదేమైనా వివిధ రకాల వేరియంట్లను ఎదుర్కోవడంలో మొక్కల ఆధారిత వ్యాక్సిన్ ‘CoVLP+ASO3’ సమర్థంగా పనిచేస్తున్నట్లు కెనడా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: అమరావతిని శ్మశానమని.. ఇప్పుడు ఎకరా ₹10 కోట్లకు అమ్ముతారా?: చంద్రబాబు
-
India News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. శిందే వర్గానికి సుప్రీం ఊరట..!
-
India News
Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
-
Business News
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు
-
Politics News
Sanjay raut: నన్ను చంపినా సరే ఆ రూట్‌ని ఆశ్రయించను: రౌత్
-
Movies News
Project K: పాన్ ఇండియా ప్రముఖులను ఒకే చోట కలిపిన అగ్ర నిర్మాణ సంస్థ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- చెరువు చేనైంది