Back Pain: వెన్నునొప్పికి నడకే పరమౌషధం

వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పి నివారణకు నడకే గొప్ప వ్యాయామమని ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైంది.

Published : 21 Jun 2024 06:19 IST

దిల్లీ: వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పి నివారణకు నడకే గొప్ప వ్యాయామమని ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైంది. పరిశోధక బృందం 700 మంది వయోజనులను మూడు బృందాలుగా విభజించింది. ఒక బృందానికి నడకను సిఫార్సు చేసింది. రెండో బృందానికి ఆరునెలలపాటు ఫిజియోథెరపీ చేశారు. మూడో బృందానికి ఏ చికిత్సా చేయలేదు. ఈ పరిశోధన బట్టి అన్నింటికన్నా ఉత్తమమైనది నడకేనని తేలింది. ఈ వ్యాయామానికి ఖర్చేమీ ఉండదు. పైగా అది తేలిక కూడా. ఏ వయసువారైనా సులువుగా నడకకు వెళ్లగలరు. ఫిజియోథెరపీకి నిపుణుల పర్యవేక్షణ కావాలి. పైగా ఖరీదైనది కూడా. అందువల్ల అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. నడక వల్ల వెన్ను నొప్పి తగ్గడమే కాదు, గుండె, రక్తనాళాలకు, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. వెన్ను దిగువ భాగంలో నొప్పి.. 2020లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్లమందిని బాధించింది. 2050కల్లా 84 కోట్లమంది దీని బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్‌లో 66 శాతంమంది వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది.. మహిళలు, గ్రామీణులు, శారీరక శ్రమ చేసే కూలీలే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు