New York: కుంగిపోతోన్న న్యూయార్క్.. కారణమిదే!
అమెరికాలోని న్యూయార్క్ నగరం కుంగుతోంది! అక్కడి లక్షలాది ఆకాశహార్మ్యాల బరువు దీనికి కారణమని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.
వాషింగ్టన్: ఎటుచూసినా ఆకాశహార్మ్యాల (Skyscrapers)తో ప్రపంచ దేశాలను ఆకట్టుకునే న్యూయార్క్ (New York)కు.. ఆ భవంతులే శాపంగా మారాయా? తాజాగా వెలువరించిన ఓ అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. ఇక్కడి బహుళ అంతస్తుల భవనాల బరువు.. నగరాన్ని కుంగిపోయేలా (Subsidence) చేస్తోందని అధ్యయనం పేర్కొంది. అమెరికా జియాలాజికల్ సర్వే సంస్థ (USGS), యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని జియాలజిస్టులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ‘ఎర్త్ ఫ్యూచర్ జర్నల్ (Earth's Future Journal)’లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు మొదటగా న్యూయార్క్ నగరాన్ని చతురస్రాకార గ్రిడ్‌లుగా విభజించారు. ఈ క్రమంలోనే దాదాపు పది లక్షలకుపైగా భవనాలు ఉన్నాయని తేల్చారు. వాటి బరువు దాదాపు 85 కోట్ల టన్నుల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలోనే నగరం ఏటా 1- 2 మిల్లీమీటర్ల మేర వేగంతో కుంగిపోతోన్నట్లు గుర్తించారు. నేల స్వభావం, ఉపగ్రహ సమాచారాన్ని విశ్లేషించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. అప్పటికీ.. రోడ్లు, కాలిబాటలు, వంతెనలు, రైల్వేలు, చదును ప్రదేశాల ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోలేదు. లోయర్ మాన్‌హాటన్, బ్రూక్లిన్, క్వీన్స్ తదితర ప్రాంతాలు వేగంగా కుంగిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది.
‘ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరం వెంబడి సముద్ర మట్టాల పెరుగుదల ప్రపంచ సగటుకన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో న్యూయార్క్ నగరంలోని 84 లక్షల జనాభాకు.. ముంపు ముప్పు పొంచి ఉంది’ అని యూఎస్‌జీఎస్‌కు చెందిన ప్రధాన పరిశోధకుడు, భూగర్భ శాస్త్రవేత్త టామ్ పార్సన్స్ పేర్కొన్నారు. తీరప్రాంతాలు, జలవనరుల వద్ద నిర్మించే ప్రతి భవనం.. భవిష్యత్తులో వరదలకు కారణమవుతుందని అవగాహన కల్పించడమే తమ అధ్యయన ఉద్దేశమని తెలిపారు. సముద్ర మట్టాల పెరుగుదల, వరద ముప్పు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించే కార్యాచరణకు తమ పరిశోధనల ఫలితాలు ఉపయోగపడతాయని పార్సన్స్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirupati: తిరుపతిలో జూలో పెద్దపులి పిల్ల మృతి
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి