Gurpatwant Singh Pannun: పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్‌ గుప్తా అప్పగింత!

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్‌ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు అమెరికాకు అప్పగించినట్లు సమాచారం.

Published : 17 Jun 2024 08:07 IST

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ

వాషింగ్టన్‌: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అరెస్టై చెక్‌ రిపబ్లిక్‌ జైలులో మగ్గుతున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఆయన్ను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.

అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ సుపారీ ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అమెరికా సూచనల మేరకే తాము గుప్తాను అరెస్టు చేసినట్లు చెక్‌ అధికారులు వెల్లడించారు. వ్యాపార, విహార యాత్ర కోసం చెక్‌ రిపబ్లిక్‌ వెళ్లిన తనను గతేడాది జూన్‌ 30న విమానాశ్రయంలో అరెస్టు చేశారని గుప్తా ఓ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (NSA) జేక్‌ సలీవన్‌ త్వరలో భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డొభాల్‌లో ఆయన భేటీ కానున్నారు. ఈ తరుణంలో గుప్తా తరలింపు వ్యవహారం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయం సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇలాంటి కుట్రల్లో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోపణలపై దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఈ కుట్రతో తనకు ఎలాంటి సంబంధం లేదని గుప్తా సైతం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ వ్యాజ్యంలో పేర్కొన్నారు. తనని అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. పైగా అమెరికా ఒత్తిడి మేరకు చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు తప్పుడు న్యాయ సలహాలతో తనని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తమ న్యాయవాది రోహిణి మూసా ద్వారా కోర్టుకు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని