US Presidential Debate: అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ.. నిక్కీ, వివేక్ మధ్య తీవ్ర వాగ్వాదం
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఈ సారి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు. బుధవారం జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో వీరి మధ్య చర్చ వాడీవేడీగా సాగింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Elections) రిపబ్లికన్ (Republican) పార్టీ అభ్యర్థిత్వం కోసం ఈసారి భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన తొలి బహిరంగ చర్చ వాడీవేడీగా సాగింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ 30 సెకన్లపాటు ఒకరిపై ఒకరు పెద్దగా అరుస్తూ.. వేళ్లు చూపించుకొనే దాకా వచ్చింది. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) సహా మొత్తం ఎనిమిది మంది అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతుండగా.. ఆరుగురు బుధవారం జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చకు ట్రంప్ హాజరుకాలేదు. అయితే, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు ఒకే వేదికపై చర్చలో పాల్గొనడం ఇదే తొలిసారి.
హంతకుడికి మద్దతు తెలుపుతున్నారు..: నిక్కీ హేలీ
విదేశాంగ విధానాలపై వివేక్ రామస్వామికి అవగాహన లేదని నిక్కీ హేలీ విమర్శించారు. అలాగే, రష్యా విషయంలో ఆయన వైఖరిని తప్పుబట్టారు. ‘‘వివేక్ ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలనుకుంటున్నారు. తైవాన్‌ను చైనా మింగేయాలని, ఇజ్రాయెల్‌కు సాయం ఆపేయాలని కోరుకుంటున్నారు. మిత్రులకు ఇలా చేయడం మంచిది కాదు. ఒక హంతకుడి పక్షాన నిలవడం ద్వారా మీరు అమెరికా భద్రత విషయంలో రాజీ పడుతున్నారనే విషయం అర్థమవుతోంది. విదేశాంగ విధానంపై మీకు ఎలాంటి అవగాహన లేదు. అది మీ మాటల్లోనే తెలుస్తుంది ’’ అని వివేక్‌పై నిక్కీ విమర్శలు చేశారు. బహిరంగ చర్చకు ముందు కూడా సోషల్ మీడియాలో విదేశాంగ విధానంపై వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
వారి ఒత్తిడితోనే మీరలా మాట్లాడుతున్నారు..: వివేక్
అయితే, నిక్కీ చేసిన ఆరోపణలు అబద్ధాలని వివేక్ కొట్టిపారేశారు. ఆమె అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌కు అధిక సాయం అందించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. ‘‘అమెరికా దక్షిణ సరిహద్దును కాపాడుకునేందుకు మనం అధిక సైనిక వనరులను కేటాయించాలి. ఉక్రెయిన్ గెలవడం అమెరికా ప్రాధాన్యం కాదు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడి చేయడం వల్లే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నారు. బైడెన్‌పై పోటీకి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటోంది. కానీ, వారిలో చాలా మంది కీలకమైన విదేశాంగ విధానం విషయంలో బైడెన్‌కు మద్దతు ఇస్తున్నారు’’ అని వివేక్ రామస్వామి ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కోసం మరోసారి సెప్టెంబరు 22న బహిరంగ చర్చ జరగనుంది.
చర్చ అనంతరం స్థానిక మీడియా సంస్థలు వివేక్ రామస్వామి అమెరికన్లకు పెద్దగా పరిచయంలేని వ్యక్తిగా పేర్కొన్నాయి. ఆయనకు రాజకీయ అనుభవం లేని కారణంగానే విమర్శలపాలవుతున్నారని తెలిపాయి. విదేశాంగ విధానంపై కూడా వివేక్ అవగాహన లేదని పేర్కొన్నాయి. ఈ తరహా వాదనలతో ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో గెలవలేరని అభిప్రాయపడ్డాయి. కొద్ది రోజుల క్రితం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం వివేక్‌కు మద్దతు తెలిపారు. ఆయన ఎంతో నమ్మకమైన వ్యక్తి అని, తను నమ్మిన అంశాలనే స్పష్టంగా చెబుతాడని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాళ్ల దగ్గర దళిత ఎమ్మెల్యే
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్