Nikki Haley: ‘ఫాదర్స్‌ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ

భారత సంతతి మహిళ, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ (Nikki Haley) తన తండ్రిని కోల్పోయినట్లు వెల్లడించారు.

Updated : 17 Jun 2024 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సంతతి మహిళ, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ (Nikki Haley) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘ఫాదర్స్‌ డే’ రోజునే ఆమె తన తండ్రిని కోల్పోయారు. ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌ రంధావా కన్నుమూసిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. గతంలో ఆయనకు క్యాన్సర్‌ నిర్ధరణ అయ్యింది. 

‘‘నాకు తెలిసిన తెలివైన, ప్రియమైన, అత్యంత దయగల, మర్యాదగల వ్యక్తిని కోల్పోయాను’’ అని హేలీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తండ్రితో గతంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. తన తండ్రి లేడనే విషయం తెలిసి తన హృదయం బరువెక్కిందన్నారు. తండ్రికి ‘ఫాదర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. తమ కుటుంబం ఎంతో కోల్పోతోందని పేర్కొన్నారు.

అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం

భారత్‌కు చెందిన అజిత్‌ సింగ్‌ రంధావా.. ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. దక్షిణ కరోలినాలో వూరీస్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి గతేడాది నిక్కీ హేలీ పోటీపడుతోన్న సమయంలోనే ఆయన క్యాన్సర్‌ బారిన పడినట్లు తెలిసింది. అప్పట్లో ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చిన హేలీ.. తండ్రి వద్దకు వెళ్లారు.

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడిన భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ.. వాషింగ్టన్‌ డీసీ ప్రైమరీలో డొనాల్డ్‌ ట్రంప్‌పై నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో అక్కడ రిపబ్లికన్‌ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. ఆ తర్వాత సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినా సహా చాలా ప్రైమరీల్లో వెనకబడటంతో పోటీ నుంచి వైదొలిగారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని