Nityananda: అమెరికా నగరాలతో నిత్యానంద ‘కైలాస’ ఒప్పందాలు!

వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. ‘కైలాస’తో ‘సోదరి-నగరం’.

Updated : 18 Mar 2023 09:29 IST

న్యూయార్క్‌: వివాదాస్పద గురు నిత్యానంద(Nityananda) స్థాపించిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస(Kailasa) దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. ‘కైలాస’తో ‘సోదరి-నగరం’ ఒడంబడికను చేసుకున్నట్లు న్యూజెర్సీలోని నెవార్క్‌ నగరం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 12న జరిగిన ఈ సంతకాల కార్యక్రమానికి నగరంలోని సిటీ హాల్‌ వేదికగా నిలిచింది. మరోపక్క రిచ్‌మండ్‌, వర్జీనియా, డేటన్‌, ఒహాయో, బ్యూనా పార్క్‌, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఉనికిలో లేనిదిగా భావిస్తున్న నకిలీ దేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదిరిన తీరును ఫాక్స్‌ న్యూస్‌ గురువారం ఓ కథనంలో విమర్శించింది. ఆ నకిలీ గురువు బోల్తాకొట్టించిన నగరాల జాబితా సుదీర్ఘంగా ఉందని ఆక్షేపించింది. పలు నగరాలు ఆయా ఒప్పందాల ప్రకటన నిజమేనని వెల్లడించాయంది. భారత్‌లో అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద దేశం నుంచి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి దాన్ని కైలాస దేశంగా పేర్కొంటున్నట్లు కథనాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని