
Mohammad Hafeez: బంకుల్లో పెట్రోల్ లేదు.. ఏటీఎంలో నగదు నిల్..!
పాక్ మాజీ క్రికెటర్ హఫీజ్ ట్వీట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహార తీరుపై గతంలో గళంవిప్పిన హఫీజ్.. తాజాగా అక్కడి పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. లాహోర్‌లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎం యంత్రాల్లో నగదు అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ట్వీట్ చేశారు. రాజకీయ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించాడు. తన ట్వీట్‌కు ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు.
గత కొంతకాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ గద్దెదిగిపోవడం, ఆ తర్వాత పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికవడం, ఆపై ఇమ్రాన్ తిరుగుబాటు ప్రకటించడం.. వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహమ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరఫును మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కొద్దికాలం పాటు కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగులతోపాటు 250 వికెట్లు తీశాడు. 2017లో పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
-
Movies News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
-
World News
Jail Attack: నైజీరియా కారాగారంపై దాడి.. 600 మంది ఖైదీలు పరార్
-
Politics News
Congress: 110 ఏళ్ల చరిత్రలో.. యూపీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్
-
General News
Anand Mahindra: మీరు ఎన్నారైనా?.. నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని రిప్లై
-
India News
Dilip Ghosh: ‘కడుపు నిండా తిని ఇఫ్తార్ విందులకు వెళ్తారు’.. దీదీపై భాజపా నేత విమర్శలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Siocial Look: లుక్ కానీ లుక్‌లో సోనాక్షి.. హుషారైన డ్యాన్స్‌తో విష్ణుప్రియ!
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Sridevi Drama Company: ఆషాఢం స్పెషల్.. అత్తలు, అల్లుళ్ల అల్లరే అల్లరి!
- Boko Haram: బోకోహరం ఉగ్రసంస్థ అధినేత హతం!
- Watermelon: కేజీ రూ.4లక్షలు..ఈ పుచ్చకాయ చాలా కాస్ట్లీ గురూ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Presidential Election: నెహ్రూ మద్దతు లేకుండానే ప్రథమ రాష్ట్రపతి పదవి
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- యాప్స్ ఇన్స్టాల్ కాకపోతే?