Borris johnson: నిబంధనలకు విరుద్ధమని నాకెవరూ చెప్పలేదు: బోరిస్

కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా క్షమాపణలు చెప్పినా.. వివాదం సద్దుమణగ

Published : 20 Jan 2022 02:03 IST

లండన్‌: కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా క్షమాపణలు చెప్పినా.. వివాదం సద్దుమణగలేదు. నిబంధనలు ఉల్లంఘించిన బోరిస్‌.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోరిస్‌ మరోసారి ఆ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీ జరుపుకోవడం కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని అధికారులెవరూ తనకు చెప్పలేదన్నారు. తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో తాము పనిచేస్తున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

డౌనింగ్‌ స్ట్రీట్‌లో పార్టీ గురించి ప్రధాని బోరిస్‌కు ముందే తెలుసని, తెలియదని అబద్ధం చెబుతూ ఎంపీలను తప్పుదోవ పట్టిస్తున్నారని బోరిస్‌ మాజీ సలహాదారు డామినిక్‌ కమింగ్స్‌ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. అయితే, కమింగ్స్‌ చేసిన వ్యాఖ్యలను బోరిస్‌ ఖండించారు. తాను దీనిని నమ్మలేకపోతున్నానని, జరిగిన సంఘటన నిబంధనలకు విరుద్ధమని ప్రజలు చెబుతున్నారు.. కానీ, అధికారులెవరూ తనని అలా హెచ్చరించలేదని తెలిపారు. పార్టీకి హాజరైన మాట వాస్తవమే కానీ, అది నిబంధనలకు విరుద్ధమని తనకు తెలియదన్నారు. ఇది ఎలా జరిగిందో ఊహించుకోలేపోతున్నానని బోరిస్‌ చెప్పుకొచ్చారు. ‘ఎంపీలను తప్పుదోవ పట్టించినట్లుగా విచారణలో తేలితే రాజీనామా చేస్తారా?’అని మీడియా అడిగిన ప్రశ్నకు.. నివేదిక వచ్చిన తర్వాత చూద్దామని బోరిస్‌ సమాధానమిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని