North Korea: ఆ సాహసం చేస్తే.. తీవ్ర పరిణామాలు: కిమ్‌ సోదరి హెచ్చరిక

దక్షిణకొరియా వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి అంటూ ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఉ.కొరియా అధినేత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మండిపడ్డారు. దక్షిణ కొరియా ముందస్తుదాడి వంటి ఏమైనా సాహసాలు చేస్తే ఆ

Published : 04 Apr 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  దక్షిణకొరియా వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి అంటూ ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఉ.కొరియా అధినేత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మండిపడ్డారు. దక్షిణ కొరియా ముందస్తుదాడి వంటి ఏమైనా సాహసాలు చేస్తే ఆ దేశంలోని కీలక లక్ష్యాలను వెంటనే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటవంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయడంతోపాటు.. పరిస్థితిని మరింత దిగజారుస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు చేసేందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. మరోవైపు ఉత్తరకొరియా వర్కర్స్‌పార్టీ సెంట్రల్‌ కమిటీ సెక్రటరీ పాక్‌ జాంగ్‌ ఛోన్‌ మాట్లాడుతూ దక్షిణ కొరియా సేనలు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా.. తమ సేనలు నిర్దయగా సియోల్‌లోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయన్నారు. దక్షిణకొరియా వారి లక్ష్యాలు ఏమిటో వెల్లడించలేదు. 

దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి సు వూక్‌ శుక్రవారం మాట్లాడుతూ.. తమ దేశం వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్నాయని తెలిపారు. అవి చాలా కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తాయని పేర్కొన్నారు. ఉత్తరకొరియాలో ఏప్రాంతాన్ని అయినా ఇవి తాకగలవని వెల్లడించారు.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ మధ్యలో ఉత్తరకొరియా రెండుసార్లు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఆయుధతయారీకి సాయం చేసిన ఐదు సంస్థలపై శుక్రవారం అమెరికా ఆంక్షలు విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని