US: రష్యాకు రహస్యంగా ‘షెల్స్‌’ సరఫరా.. ఉత్తర కొరియాపై అమెరికా ఆరోపణలు

ఉత్తర కొరియాపై అమెరికా కీలక ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోన్న రష్యాకు ఆర్టిలరీ షెల్స్‌ను సరఫరా చేస్తోందని ఆరోపించింది.

Published : 03 Nov 2022 01:10 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉత్తర కొరియాపై అమెరికా కీలక ఆరోపణలు చేసింది. ఆర్టిలరీ షెల్స్‌ను భారీ స్థాయిలో రష్యాకు చేరవేస్తోందని తమకు సమాచారం ఉందని పేర్కొంది. ఈ తతంగాన్నంతా ఉత్తర కొరియా ‘రహస్యంగా’ చేస్తోందని శ్వేత సౌధం జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ ఆరోపించారు. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికాలోని దేశాలకు సరుకులను ఎగుమతుల పేరుతో రవాణా చేస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పర్యవేక్షించనున్నట్లు కూడా తెలిపారు. ఐక్యరాజ్యసమితిని సంప్రదించి దీనిపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని