North Korea: కిమ్ రాజ్యంలో మరో దారుణం.. 2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు
ఉత్తరకొరియా (North Korea)లో ఓ రెండేళ్ల చిన్నారిని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించడం సంచలనం రేపుతోంది. కిమ్ (Kim Jong Un) రాజ్యంలో జరుగుతోన్న అకృత్యాలపై అమెరికా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రాజ్యంలో దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న నేరాలకే అక్కడ ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కిమ్ పాలనలో అకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కన్పిస్తే అక్కడ కఠిన శిక్షలు విధిస్తున్నారట. అలా ఓ రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో అమెరికా (USA) విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలపై పాల్పడుతున్న దారుణాలను పేర్కొంది. ఇతర మతాల వారి పట్ల కిమ్ రాజ్యం అమానవీయంగా ప్రవర్తిస్తోందని తెలిపింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 70వేల మంది క్రైస్తవులను ఖైదు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో 2009లో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ఇలా మతపరమైన కార్యకలాపాలకు యత్నించినందుకు గానూ అనేక మంది క్రైస్తవులను అరెస్టు చేసి పొలిటికల్ జైలు శిబిరాలకు తరలించారని నివేదిక తెలిపింది. అయితే, ఆ శిబిరాల్లో ఖైదీలు అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. వారిని శారీరకంగా హింసించడం, జీవించే హక్కును తిరస్కరించడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి అకృత్యాలు ఆ శిబిరాల్లో జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.
2021 డిసెంబరులో కొరియా ఫ్యూచర్ అనే ఓ లాభాపేక్ష లేని సంస్థ కూడా కిమ్ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది. మతస్వేచ్ఛను కోరుకునే వారు అత్యంత తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. అత్యాచారం, బలవంతంగా అవయవాల దోపిడీ, హత్యలు, గూఢచర్యానికి పంపించడం వంటి దారుణాలకు ఉ.కొరియా అధికారులు పాల్పడుతున్నారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!