North Korea: మరోమారు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు..!

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టి మరోమారు ఉద్రిక్తతలు రాజేసింది. రెండు బాలిస్టిక్ మిసైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు

Published : 27 Jan 2022 23:25 IST

సియోల్‌: ఉత్తర కొరియా మరోమారు క్షిపణి ప్రయోగాలు చేపట్టి ఉద్రిక్తతలు రాజేసింది. రెండు బాలిస్టిక్ మిసైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్టు దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఇది జనవరి నెలలో జరిపిన ఆరో ప్రయోగమని వారు తెలిపారు. గురువారం స్వల్ప శ్రేణి క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించినట్లు చెప్పారు. కొన్ని నెలలుగా ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. ఈ నెల ప్రారంభంలో హైపర్ సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించిన కిమ్..  ఆ తర్వాత రైలు నుంచి క్షిపణులను ప్రయోగించారు. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు చేపట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ దేశాన్ని.. అమెరికా ద్వేషభావంతో చూస్తోందని, ఈ నేపథ్యంలో అణు పరీక్షలు ముమ్మరం చేసేందుకు నిర్ణయించుకున్నట్టు ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని