North Korea: రైలు నుంచి క్షిపణి ప్రయోగం.. అమెరికా ఆంక్షలను బేఖాతరు చేస్తూ..!

అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్ మిసైల్​ను పరీక్షించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది......

Published : 16 Jan 2022 03:36 IST

ప్యాంగ్యాంగ్‌: అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్ మిసైల్​ను పరీక్షించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా ఆంక్షలకు తాము బెదిరేదిలేదనే సందేశాన్నిచ్చేందుకే.. నెల రోజుల వ్యవధిలోనే ఉత్తర కొరియా మూడో ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అగ్రరాజ్యం ఇటీవలే కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఎవరికీ బెదరమనే సంకేతాన్ని ఇచ్చేందుకే కిమ్​ దేశం శుక్రవారం ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా రెండు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపిన మరుసటి రోజే మీడియా ఈ ప్రకటన విడుదల చేసింది.

ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై అమెరికా బుధవారం ఆంక్షలు విధించింది. ఆ దేశంపై కొత్త ఆంక్షలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరతామని చెప్పింది. ఇదిలా ఉంటే.. అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలనే లక్ష్యంతోనే కిమ్ జోంగ్ ఉన్​ ప్రభుత్వం ఎవరినీ లెక్కచేయకుండా వరుసగా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఒక్క నెల వ్యవధిలోనే మూడు క్షిపణులను పరీక్షించింది. తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వీటిని చేపడుతున్నట్లు తమ చర్యను ఆ దేశం సమర్థించుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు