North Korea: శ్వాసకోశ అనారోగ్యం.. ఉత్తర కొరియాలో మరోసారి లాక్‌డౌన్‌..!

ఉత్తర కొరియా(North Korea) మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో ఐదు రోజుల పాటు కరోనా ఆంక్షలు విధించింది.

Published : 25 Jan 2023 13:47 IST

ప్యాంగ్యాంగ్‌: ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికీ కరోనా వైరస్(Corona Virus) ప్రభావం చూపిస్తోంది. చైనా(China)లో వైరస్ కేసులు ఇంకా భారీగానే ఉంటున్నాయి. ఈ సమయంలో డ్రాగన్ పొరుగు దేశం ఉత్తర కొరియా(North Korea) తన రాజధాని నగరంలో ఐదురోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. అందుకు కరోనానే కారణమని అధికారిక ఉత్తర్వుల్లో ఎక్కడా చెప్పలేదు. శ్వాసకోశ అనారోగ్యానికి సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ కొరియాకు  చెందిన వార్తా కథనం పేర్కొంది.

ఆదివారం వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రజలు ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించుకోవాలని, అలాగే ఆ వివరాలను సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో మంగళవారం ప్రజలు భారీగా నిత్యావసరాలను నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా లాక్‌డౌన్లు విధించారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలాఉంటే.. తమ దేశంలో మొదటిసారి కరోనా వెలుగుచూసిందని గత ఏడాది ఉత్తర కొరియా(North Korea) ప్రకటించింది. అలాగే ఆగస్టు కల్లా వైరస్‌పై విజయం సాధించినట్లు కూడా చెప్పింది. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో.. ఎంతమంది వైరస్‌ బారినపడ్డారనేదానిపై స్పష్టత కొరవడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు