North Korea: కిమ్‌కు కరోనా భయంలేదు.. మాస్క్‌ తీసి..!

ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత ముఖానికి కనీసం మాస్క్‌కు కూడా లేకుండా ఓ సైనిక జనరల్‌ అంత్యక్రియల్లో

Published : 24 May 2022 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత ముఖానికి కనీసం మాస్క్‌కు కూడా లేకుండా ఓ సైనిక జనరల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ విషయం ఓ పెద్ద ఘనకార్యంలా ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ ప్రచారం చేసుకొంది. కిమ్‌ తండ్ర మరణం తర్వాత ఉ.కొరియాలో జరిగిన అతిపెద్ద అంత్యక్రియల కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. 

ఉ.కొరియాకు చెందిన పీపుల్స్‌ ఆర్మీలోని మార్షల్‌ హయోన్‌ చాల్‌ హెయ్‌ మృతి చెందారు. ఆయన ప్రస్తుత నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌కు అత్యంత నమ్మకస్తుడు. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణించిన తర్వాత అధికారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు దక్కేట్లు చేసిన కీలక సైనిక జనరల్‌ ఆయనే. 1950-53 మధ్యంలో కిమ్‌ ఇల్‌ సంగ్‌కు కూడా ఆయన బాడీగార్డ్‌గా పనిచేశాడు. 

ఇటీవల ఆ దేశంలో కరోనా లక్షణాలు ప్రబలిన సమయంలోనే పలు శరీర అవయవాలు పనిచేయకపోవడంతో హయోన్‌ మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు కిమ్‌ ఆదివారం హాజరయ్యారు. హయోన్‌ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికను స్వయంగా మోశారు. ఈ సమయంలో మిగిలిన అధికారులు మాస్కులు ధరించినా.. కిమ్‌ మాత్రం ధరించలేదు. ప్యాంగ్‌యాంగ్‌ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో వేల మంది పాల్గొన్నారు. 

ప్రస్తుతం ఉత్తరకొరియాలో 28 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్యను మాత్రం పేర్కొనలేదు. ఏప్రిల్‌ 25వ తేదీన జరిగిన మిలటరీ పరేడ్‌లో వేలమంది ప్రజలు మాస్కులు లేకుండా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా కొవిడ్‌ కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. సోమవారం కొత్త అక్కడ 1,67,650 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు కేసీఎన్‌ఏ మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని