China: మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు.. వైరల్‌గా వీడియోలు

చైనాలోని జియామెన్‌ నగరంలో సీఫుడ్‌లోనూ వైరస్‌ను పరీక్షించే పనిలో పడ్డారు అక్కడి అధికారులు. చేపలు, పీతలకు కూడా కొవిడ్‌ పరీక్షలు చేస్తు్న్నారు.........

Published : 20 Aug 2022 01:34 IST

బీజింగ్‌: కరోనా వ్యాప్తితో చైనీయులు ఇంకా వణికిపోతూనే ఉన్నారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతంలోని లక్షల మందిని క్వారంటైన్‌లో ఉంచి, ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా చైనాలోని జియామెన్‌ నగరంలో కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో అక్కడి 5మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఆ పరీక్షలను మనుషులకు మాత్రమే పరిమితం చేయలేదు. సీఫుడ్‌లోనూ వైరస్‌ను పరీక్షించే పనిలో పడ్డారు అధికారులు. చేపలు, పీతలకు కూడా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

పీపీఈ కిట్టు ధరించిన వైద్య సిబ్బంది చేపలు, పీతలకు పీసీఆర్‌ విధానంలో కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలను సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ట్విటర్‌లో పంచుకుంది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు అక్కడి సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ చర్యను కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. వాటిల్లో కరోనా ఉందో, లేదో తెలుసుకునేందుకు టెస్టులు కాకుండా మరే ఇతర మార్గం లేదు అని ఓ వర్గం పేర్కొంటోంది. అయితే, అతి జాగ్రత్తతో ఈ తరహా పరీక్షలు చేస్తూ ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మరో వర్గం వారిస్తోంది. ఇదో పిచ్చిపని అని.. అధ్యక్షుడు, అధికార యంత్రాంగానికి పిచ్చిపట్టినట్లుందని కొందరు ఈ చర్యను కొట్టిపడేస్తున్నారు.

కాగా సీఫుడ్‌కు కరోనా పరీక్షలను జియామెన్‌ నగర అధికారులు సమర్థిస్తున్నారు. ఇలా తాము మాత్రమే చేయడం లేదని.. వైరస్‌ వ్యాప్తితో వణికిపోయిన హైనన్‌ నగరం నుంచి పాఠాలు నేర్చుకున్నామని పేర్కొంటున్నారు. కొవిడ్‌ నివారణ చర్యలను చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులతో కలిసే అవకాశం ఉందని.. వారంతా సముద్రంలోకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత కచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందేనని ఆదేశాలున్నాయి. వారు తీసుకొచ్చిన సీఫుడ్‌ను కూడా పరీక్షించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని