Imran Khan: పాక్‌లో అణ్వస్త్రాలు సురక్షితంగా లేవు : ఇమ్రాన్ ఖాన్ ఆందోళన
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అక్కడి సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఓ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో అణ్వాయుధాలు దొంగలు,
ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అక్కడి సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఓ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో అణ్వాయుధాలు దొంగలు, దోపిడీదారుల చేతిలో సురక్షితంగా లేవని పేర్కొనారు. ఆయన కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సైన్యం కుట్రపూరితంగా అధికారంలోకి తెచ్చిన వారు దేశ అణుకార్యక్రమాన్ని రక్షించగలరా? అని ప్రశ్నించారు. తనను పదవి నుంచి తప్పించడాన్ని ఓ విదేశీ కుట్రగా అభివర్ణించారు. అమెరికా బానిసలు, జర్దారీలు, షరీఫ్‌లకు అలవాటు పడిందని ఎద్దేవా చేశారు. అనంతరం తన కార్యక్రమానికి హాజరైన వారికి ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై సైన్యం మండిపడింది. ఆ మర్నాడే డీజీఐఎస్పీఆర్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మాట్లాడుతూ ఖాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. పాక్ అణ్వాయుధాలు ఏ ఒక్కరి సొత్తు కాదని వ్యాఖ్యానించారు. పాక్ అణ్వాయుధ కమాండ్, కంట్రోల్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందని వెల్లడించారు.
పీటీఐ సభ్యులను ప్రతిపక్ష నాయకుడిగా నియమించొద్దు..!
పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ నుంచి ఎవరినీ ప్రతిపక్ష నాయకుడిగా నియమించవద్దని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని పాక్ స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఏప్రిల్ 10వ తేదీన ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పాక్ చరిత్రలో ప్రధాని పదవి నుంచి ఓటింగ్ ద్వారా తొలగించిన తొలి వ్యక్తిగా ఇమ్రాన్ నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?