
Imran Khan: ‘దేశాన్ని దొంగలకు అప్పగించడం కంటే అణుబాంబు వేయడం మంచిది’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నూతన ప్రభుత్వంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి షెహ్‌బాజ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దేశాన్ని దొంగలకు అప్పజెప్పడం కంటే అణుబాంబు వేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ.. దేశాన్ని దొంగలు హస్తగతం చేసుకోవడం చూసి తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వీరు ప్రతి సంస్థను, న్యాయవ్యవస్థను నాశనం చేశారని పేర్కొంటూ.. ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి ఈ నేరస్థుల కేసులను విచారిస్తారని ప్రశ్నించారు. ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం మానేసి, ప్రభుత్వ పనితీరును చక్కదిద్దాలని ఇమ్రాన్ హితవు పలికారు.
ప్రస్తుత పరిపాలనను మరోసారి‘దిగుమతి ప్రభుత్వం’ అని పేర్కొన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఛైర్మన్.. ఈ సర్కారుకు వ్యతిరేకంగా ఈ నెల 20న ఇస్లామాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిజమైన స్వాతంత్ర్యం పొందేందుకు 20 లక్షల మందితో ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతుందని, దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. తన మద్దతుదారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. 11 పార్టీలు ఏకమై తనను ప్రధాని పదవి నుంచి తొలగించాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ రూపాయి రోజురోజుకూ పతనమవుతూ, దేశ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది. ఆ దేశ కరెన్సీలో డాలరు విలువ రూ.193 పలికింది. ఈ పరిస్థితిపై ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం స్పందించారు. దేశ సంక్షోభ సమయంలో ‘తటస్థులు’గా వ్యవహరించిన తమ ఆర్మీయే ఇందుకు కారణమని నిందించారు. పాక్‌పై విదేశీకుట్ర విజయవంతమై తన ప్రభుత్వం పతనమైతే, అప్పటికే బలహీనంగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారుతుందని ముందుగానే సైన్యాన్ని హెచ్చరించానని గుర్తు చేసుకొన్నారు. ఇపుడు పాక్ మార్కెట్ సంస్కరణలు కోరుకొంటున్నా.. దేశంలోని ‘దిగుమతి ప్రభుత్వం’ చేతులు కట్టుకు కూర్చొందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: నాలుగో రోజు తొలి సెషన్ పూర్తి.. టీమ్ఇండియా ఆధిక్యం 361
-
Movies News
Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్.. కల్యాణ్‌రామ్ రాజసం చూశారా!
-
Politics News
Telangana News: కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక
-
Movies News
Naga Chaitanya: నేను ఏదైనా నేరుగా చెప్తా.. ద్వంద్వార్థం ఉండదు: నాగచైతన్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!