suez canal: సూయిజ్‌ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్‌

ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో ముడి చమురు సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్‌ మరమ్మతుకు గురై ఆగిపోయింది.  

Published : 04 Jun 2023 23:57 IST

కైరో: ముడి చమురును సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్‌ ఆదివారం ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో మరమ్మతుకు గురై ఆగిపోయింది. దీంతో ఈ జలమార్గంలో రవాణాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు చమురును సరఫరా చేస్తున్న మాల్టా దేశ నౌకకు యాంత్రికపరమైన లోపం తలెత్తడంతో ఆగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ట్యాంకర్‌ వెనక మరో ఎనిమిది నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు. మూడు పడవలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆ ట్యాంకర్‌ను వేరే చోటుకు తరలించాయని, దీంతో అక్కడి ట్రాఫిక్‌ సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు.

 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని