మెలోని పాత వీడియో వైరల్‌.. లేడీ గ్యాంగ్‌స్టర్‌ అంటున్న నెటిజన్లు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన పాత వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమెను కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Published : 21 Jun 2024 00:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటలీ (Italy) వేదికగా నిర్వహించిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) సెల్ఫీ దిగిన వీడియోలు నెట్టింట ట్రెండ్‌గా మారాయి. మోదీని ఆహ్వానిస్తూ ఆమె నమస్తే అంటూ సాదర స్వాగతం పలికింది. దీనిని సంబంధించిన దృశ్యాలతో సోషల్‌మీడియా నిండిపోయింది. తాజాగా ఆమెకు చెందిన మరో వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మెలోని 1992లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె పాల్గొన్న సమావేశాలు, నిర్వహించిన ర్యాలీలు, మాట్లాడిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు ‘‘ఎక్స్‌’’ వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని చూసిన యూజర్లు మెలోనిని మెచ్చుకుంటున్నారు. లెదర్‌ జాకెట్‌ ధరించి, ఆత్మవిశ్వాసంతో లేడీ గ్యాంగ్‌స్టర్‌లా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఒప్పందం.. విడ్డూరం..! రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా

2022 అక్టోబర్‌ తర్వాత ఇటలీకి మెదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జార్జియా మెలోని మితవాద పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 15 సంవత్సరాల వయసులోనే యూత్‌ ఫ్రంట్‌ను ప్రారంభించిన మెలోని.. రాజకీయాల ద్వారా బెర్లుస్కోనీ ఆధ్వర్యంలో యువజన మంత్రిగా ఎదిగారు. తన పదవీకాలంలోనే కఠినమైన వలస నియంత్రణలు తీసుకొచ్చారు. పన్ను విధానాల్లో కీలక మార్పులు తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని