Ukraine Crisis: ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్
ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టిన షూటర్.. ఆపద సమయంలో దేశ రక్షణ కోసం నడుం బిగించింది.......
తుదివరకు పోరాడతానన్న వీరనారి
కీవ్: ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టిన షూటర్.. ఆపద సమయంలో దేశ రక్షణ కోసం నడుం బిగించింది. షూటింగ్లో తన ప్రతిభతో శత్రువులను చెండాడుతానంటూ సరిహద్దుల్లో గస్తీ కాస్తోందా యువతి. 2016లో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌లో క్రాస్ కంట్రీ స్కీయింగ్ రైఫిల్ షూటింగ్ విభాగంలో పసిడి సాధించిన క్రిస్టినా ద్మిత్రెంకో (22) ప్రస్తుతం దేశాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. దేశ సైన్యంలో చేరి సేవలందిస్తోంది.
ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన క్రిస్టినా భవిష్యత్తు.. రష్యా దురాక్రమణతో చిన్నాభిన్నమైంది. కొద్దిరోజుల వ్యవధిలోని ఆమె జీవితం ఊహించని మలుపుతిరిగింది. న్యూస్‌వీక్ వార్తా సంస్థ వివరాల ప్రకారం.. ఓ అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 27న ద్మిత్రెంకో స్విట్జర్లాండ్ వెళ్లాల్సింది. ఇందుకోసం ఆమె కఠోర సాధన చేసింది. అయితే దానికి మూడు రోజుల ముందే (ఫిబ్రవరి 24) ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. ఆ పోటీలకు వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయి. అయితే దేశ పరిస్థితులను చూసి చలించిన ఆమె.. శత్రువులను ఎదుర్కొనేందుకు దేశ సైన్యానికి మద్దతుగా నిలవాలని నిశ్చయించుకుంది.
ఆశలు అడియాశలు కావడంపై సైన్యంలో చేరేముందు క్రిస్టినా ద్మిత్రెంకో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసింది. ‘నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఎప్పుడూ ఊహించలేదు. అయినా కష్టాలకు ఎదురునిలుస్తా. శత్రువులకు భయపడేది లేదు. నా చేతిలో ఏ తరహా ఆయుధం ఉన్నా నేను ఎక్కుపెట్టిన గురి తప్పదు, అది పోటీ అయినా సైన్యంలో సేవలైనా. చివరి వరకు పోరాడతా. ఆక్రమణదారులు నా నుంచి తప్పించుకోలేరు. ఈ పోరులో మాదే విజయం’ అంటూ ఆమె పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత