Omicron: ఒమిక్రాన్‌లో అదే ప్రమాదకరం..!

ఒమిక్రాన్‌ (Omicron)ను గుర్తించిన దక్షిణాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు కీలక అంశాలను వెల్లడించాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే

Published : 13 Jan 2022 01:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒమిక్రాన్‌ (Omicron)ను గుర్తించిన దక్షిణాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు కీలక అంశాలను వెల్లడించాయి. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌లో లక్షణాలు లేని వ్యక్తులు అత్యధికంగా ఉన్నారని ఈ పరిశోధనలు తేల్చాయి. వీరు వాహకులుగా మారి వ్యాప్తిని మరింత రాజేస్తున్నట్లు తేలింది. సబ్‌సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో హెచ్‌ఐవీ బాధితులపై మోడెర్నా టీకా పనితీరును విశ్లేషించేందుకు ‘ఉబుంటు’ పేరిట నిర్వహించిన పరిశోధనల్లో ఒకటి భాగంగా.. మరొకటి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పనితీరును విశ్లేషించేందుకు నిర్వహించిన సిసోంకే పరిశోధనలో భాగం. 

ఉబుంటు పేరిట నిర్వహించిన పరిశోధనల్లో తొలుత డిసెంబర్‌లో 230కి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 31శాతం మంది పాజిటీవ్‌గా తేలారు. వీరందరికీ ఒమిక్రాన్‌ (Omicron) సోకినట్లు తర్వాత నిర్ధారణ అయింది. ఈ డేటా ఒమిక్రాన్‌ వ్యాప్తికి ముందున్న డేటాకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పట్లో సార్స్‌ కోవ్‌-2 పీసీఆర్‌ పాజిటివిటీ రేటు 1-2.4 మధ్యలో ఉంది. ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్లో అత్యధికంగా అసిమ్టమాటిక్‌లు ఉన్నారు.

ఇక సిసోంకే పేరిట 577 మందిపై నిర్వహించిన అధ్యయనంలో అసిమ్టమాటిక్‌లు 16శాతంగా ఉన్నట్లు తేలింది. అదే డెల్టా, బీటా వేరియంట్లలో అవుట్‌బ్రేక్‌ సమయాల్లో ఇది 2.6శాతంగానే ఉంది. ఈ ఫలితాలను బట్టి వ్యాక్సిన్లు తీసుకొన్నవారితో సహా కలిపి అత్యధిక మంది వాహకులుగా మారుతున్నారని ది సౌతాఫ్రికా మెడికల్‌ రీసెర్చి కౌన్సిల్‌ పేర్కొంది. దీనిపై డాక్టర్‌ లారెన్స్‌ కోరే మాట్లాడుతూ ‘‘ ఈ వేరియంట్‌లో చాలా మంది అసిమ్టమ్యాటిక్‌లుగా మారుతున్నారు. ఎవరు వైరస్‌ వాహకులో మనకు తెలియదు. మనల్ని మనం కాపాడుకొని వ్యాప్తిని పెంచకుండా చూసుకోవాలి’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని