Hajj pilgrimage: హజ్‌ యాత్రలో 1,300 మంది మృతి

ఈ ఏడాది హజ్‌ యాత్రలో 1,300 మందికిపైగా మృతిచెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ఆదివారం ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాడ్పులే అందుకు కారణమని తెలిపాయి.

Published : 25 Jun 2024 05:31 IST

రియాద్‌: ఈ ఏడాది హజ్‌ యాత్రలో 1,300 మందికిపైగా మృతిచెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ఆదివారం ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాడ్పులే అందుకు కారణమని తెలిపాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని తెలిపాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగమండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ అల్‌-జలజెల్‌ వెల్లడించారు. 95 మంది యాత్రికులకు చికిత్స అందుతున్నట్లు తెలిపారు. వీరిలో కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 165 మంది ఇండోనేసియా, 98 మంది భారతీయులతోపాటు ఇతర దేశాల వారు ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని