China: కుప్పకూలిన ఆరంతుస్తుల భవనం.. 39 మంది ఆచూకీ గల్లంతు!

చైనాలోని సెంట్రల్​ హునాన్​ ప్రావిన్స్‌లో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం......

Published : 01 May 2022 01:42 IST

బీజింగ్‌: చైనాలోని సెంట్రల్​ హునాన్​ ప్రావిన్స్‌లో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 23 మంది చిక్కుకోగా.. మరో 39 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. వాంగ్​చెంగ్​ జిల్లాలోని చాంగ్షా నగరంలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలోగల ఆరు అంతస్తుల భవనం శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలినట్లు చైనా అధికారిక మీడియా చైనా గ్లోబల్​ టెలివిజన్​ నెట్​వర్క్​ తెలిపింది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొంది.

ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు మీడియా వెల్లడించింది. భవనం శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ అధికారులను ఆదేశించారు. ఘటనపై అత్యవసర నిర్వహణ శాఖ మంత్రి హాంగ్‌ మింగ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ‘కూలిపోయిన భవనం యజమానిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించాం. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా.. అక్రమ, అనుమతులు లేని భవనాల నిర్మాణాలు చేపట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని