Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ముందస్తు బెయిల్ గడువు పొడిగింపు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పలు కేసుల్లో ఊరట లభించింది. శుక్రవారం ఆయన లాహోర్‌లోని పలు న్యాయస్థానాల్లో హాజరుకాగా.. ఆయన ముందస్తు బెయిల్ గడువును పొడిగిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చాయి.
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్(Imran Khan)కు లాహోర్ కోర్టుల్లో ఊరట లభించింది. లాహోర్‌లోని టాప్ మిలటరీ కమాండర్ ఇంటిపై దాడి సహా మొత్తం మూడు కేసుల్లో ఉగ్రవాద నిరోధక కోర్టు(ATC) ఆయనకు ముందస్తు బెయిల్ గడువును పొడిగించింది. శుక్రవారం ఇమ్రాన్ భారీ భద్రత మధ్య లాహోర్‌లోని ఏటీసీ న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారించిన న్యాయస్థానం.. ఈ మూడు కేసుల్లో ఇమ్రాన్‌కు ముందస్తు బెయిల్ గడువును జూన్ 13వరకు పొడిగించిందని కోర్టు అధికారి వెల్లడించారు. తన ప్రాణాలకు పెను ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానిస్తున్న ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం భారీ భద్రత నడుమ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు.
జిన్నా హౌస్‌గా పిలిచే లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్‌పై దాడి కేసులో విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ఏటీసీ జడ్జి ఇజాజ్ అహ్మద్ బుట్టార్ ప్రశ్నించగా.. తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నందువల్లే విచారణకు హాజరుకాలేకపోయినట్టు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా వీడియో లింక్ ద్వారా విచారణ జరపాలని తాను కోరుతున్నా దర్యాప్తు అధికారులు అందుకు అంగీకరించడంలేదని తెలిపారు. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశించిన న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ గడువును ఈ నెల 13వరకు పొడిగించారు. మరోవైపు, లాహోర్ హైకోర్టులోనూ ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. పీటీఐ పార్టీ కార్యకర్త జిల్లె షా హత్య కేసులో బెయిల్ గడువు పొడిగించాలని అభ్యర్థించగా.. న్యాయస్థానం ఆయన బెయిల్ గడువును జూన్ 6వరకూ పొడిగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్