Published : 19 Apr 2022 15:36 IST

Pak Cabinet: ప్రమాణ స్వీకారం చేయించే రోజే..అక్కడి అధ్యక్షుడికి అనారోగ్యం..!

ఇస్లామాబాద్‌: మొన్న పాకిస్థాన్‌ నూతన ప్రధానికి.. తాజాగా కొత్త మంత్రులకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ నుంచి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అరీఫ్ సోమవారం ఉన్నట్టుండి సెలవులో వెళ్లిపోయారు. ప్రణాళిక ప్రకారం మంగళవారం ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అసౌకర్యం కారణం చెప్పి, సెలవు తీసుకున్నారు. అయితే సెనేట్ ఛైర్మన్ సాదిఖ్ సంజ్రానీ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విభాగం కొత్త మంత్రుల జాబితాను విడుదల చేసింది. 

ఇదిలా ఉండగా.. ఇటీవల పాక్‌ నూతన ప్రధానిగా షహబాజ్‌ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందుకూడా అధ్యక్షుడు అల్వీ అస్వస్థతకు గురయ్యారు. తాజాగా మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో కూడా తన గైర్హాజరుకు అదే కారణం చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ట్విటర్ ఖాతాను బట్టి తెలుస్తోంది. ‘అధ్యక్షుడు అల్వీ అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు ఆయన్ను పర్యవేక్షించి, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు’ అని పేర్కొంది. 

పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినదగ్గరి నుంచి పాక్‌ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం, దానికి అధ్యక్షుడు ఆమోదం లభించడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పు ఇమ్రాన్‌ను గద్దె దింపింది. తాజాగా పీఎంఎల్‌(ఎన్‌) అధ్యక్షుడు షరీఫ్ నూతన ప్రధానిగా కొలువుదీరారు.  

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని