Published : 24 Mar 2022 01:39 IST

Imran Khan: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జరిమానా!

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం (ECP) జరిమానా విధించింది. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గాను ఆయనకు రూ.50వేలు జరిమానా విధించింది. కైబర్‌- పఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇమ్రాన్‌ ఈ నెల 15న స్వాత్‌ను సందర్శించొద్దని, అక్కడ బహిరంగ సభల్లో పాల్గొనొద్దంటూ ఈసీపీ నిషేధం విధించింది. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేసిన ఇమ్రాన్‌ ఖాన్‌.. మరుసటిరోజు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించరాదు. ఈ నెల 31న కైబర్‌-పఖ్తున్క్వాలో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన ప్రధానికి రెండుసార్లు ఈసీపీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్‌ ప్రధాని, ప్రణాళికా శాఖా మంత్రి అసద్‌ ఒమర్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని అమలుచేసే అధికారం ఈసీకి ఉందని స్పష్టంచేసింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని