Pakistan: రండిబాబూరండి.. మా దేశంలో స్థిరపడండి!

పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. విదేశాల వచ్చే నిధులు నిలిచిపోవడం.. దేశీయ వాణిజ్యం క్షీణించడం, పన్నులు సరిగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. రుణాలు కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు పాక్‌.. దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ సమస్యనుంచి

Published : 15 Jan 2022 23:30 IST

విదేశీ పెట్టుబడిదారులకు పాకిస్థాన్‌ ఆఫర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. విదేశాల వచ్చే నిధులు నిలిచిపోవడం.. దేశీయ వాణిజ్యం క్షీణించడం, పన్నులు సరిగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. బ్యాంకుల నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు పాక్‌.. దిక్కుతోచని స్థితిలో ఉంది. అయితే, ఈ సమస్య నుంచి గట్టేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. తమ దేశంలో భారీమొత్తంలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు నూతన జాతీయ భద్రత పాలసీని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

ముఖ్యంగా తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో చాలా మంది సంపన్నులు దేశాన్ని వదిలి మలేషియా, టర్కీలో పెట్టుబడులు పెడుతున్నారు. వారి దృష్టి పాకిస్థాన్‌పై పడేలా చేయడమే లక్ష్యంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌ వ్యాపారులు.. పాక్‌లో పెట్టుబడులు పెడితే వారికి తమ దేశ పౌరసత్వం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీరితోపాటు చైనీయులు, అమెరికన్లు, అమెరికన్‌ సిక్కులకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ఉంటున్న సిక్కులు తప్పకుండా పాక్‌లో పెట్టుబడులు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశాయి. విదేశీయులకు పాక్‌ పౌరసత్వాన్ని కల్పించడం ద్వారా కొన్ని బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు తమ దేశానికి వస్తాయని పాక్‌ ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని