Pakistan: పాక్‌లో తీవ్ర పేపర్‌ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన

దేశంలో కాగితం కొరత కారణంగా.. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం-2022లో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ హెచ్చరించింది.......

Published : 25 Jun 2022 01:36 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో (Pakistan) ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. దేశంలో కాగితం కొరత కారణంగా.. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం-2022లో విద్యార్థులకు పుస్తకాలు (books) అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ హెచ్చరించింది. వాస్తవానికి కాగితం సంక్షోభానికి ప్రపంచ ద్రవ్యోల్బణం (Global Inflation) ఒక కారణమయితే.. పాక్‌ వరకు ఇక్కడి ప్రభుత్వాల తప్పుడు విధానాలు, స్థానిక పేపర్ పరిశ్రమల గుత్తాధిపత్యం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. దీంతో సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా పాఠ్యపుస్తకాల బోర్డులు పాఠ్యపుస్తకాలను ముద్రించడంలేదు.

ఆల్ పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ (PAPGAI), ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఖైజర్ బెంగాలీ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. పేపర్‌ సంక్షోభం కారణంగా ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండవని హెచ్చరించారు. దేశంలో తీవ్రమైన పేపర్ సంక్షోభం ఉందని, పేపర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారుతోందని.. ప్రచురణకర్తలు పుస్తకాల ధరను నిర్ణయించలేకపోతున్నారని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని