Pakistan: ఇమ్రాన్‌... చివరి బంతి వరకూ పోరాడతారు..!

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం తప్పేట్లు లేదు. జాతీయ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సమయం దగ్గరపడుతోన్న సమయంలో అధికార పీటీఐ పార్టీకి మిత్రపక్షం ముతాహిదా ఖుయామి మూమెంట్ పాకిస్థాన్‌(ఎంక్యూఎం-పీ) హ్యాండ్‌ ఇచ్చింది.

Published : 30 Mar 2022 17:38 IST

ఈ రోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం తప్పేట్లు లేదు. జాతీయ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సమయం దగ్గరపడుతోన్న సమయంలో అధికార పీటీఐ పార్టీకి మిత్రపక్షం ముతాహిదా ఖుయామి మూమెంట్ పాకిస్థాన్‌(ఎంక్యూఎం-పీ) హ్యాండ్‌ ఇచ్చింది. ప్రతిపక్షాల కూటమితో చేయికలిపింది. ఈ క్రమంలో ఇమ్రాన్ నేతృత్వంలో ప్రభుత్వం మెజార్టీ కోల్పోగా.. ఆయన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఆ దేశ ఐటీ శాఖ మంత్రి మాత్రం వాటిని తోసిపుచ్చారు. ఇమ్రాన్ రాజీనామా చేయడం లేదంటూ ట్వీట్ చేశారు. ‘ప్రధాని రాజీనామా చేయడం లేదు.  చివరి బంతి వరకు తన పోరాటం కొనసాగిస్తారు. ఓటింగ్ రోజున మా శత్రువులు, మిత్రులెవరో చూస్తాం’ అంటూ స్పందించారు. 

ఇదిలా ఉండగా..ఈరోజు ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని మంత్రి షేక్ రషీద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంక్యూఎం-పీ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఫెడరల్ కేబినెట్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మిత్రపక్ష పార్టీల అధినేతలు కూడా హాజరుకానున్నారు. ఇక సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని