Pakistan: ‘లో దుస్తులు ఏకరూపంగా ఉండాల్సిందే!’.. వివరణ ఇచ్చిన పాక్‌ ఎయిర్‌లైన్స్‌

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) క్షమాపణలు చెప్పింది. తన సిబ్బంది లో దుస్తులు కూడా ఏకరూపంగా ఉండాలంటే గురువారం జారీ చేసిన ఉత్తర్వుల అంశంలో వెనక్కి తగ్గింది.

Published : 01 Oct 2022 02:30 IST

ఇస్లామాబాద్: అనాలోచిత నిర్ణయంతో పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) క్షమాపణ చెప్తూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న పీఐఏ తన సిబ్బంది ‘లో దుస్తులు కూడా కచ్చితంగా ఏకరూపంగా ఉండాలి’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఎయిర్‌లైన్స్‌పై వ్యతిరేక ప్రభావం పడుతోందని చెప్పుకొచ్చింది. గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో 24 గంటల్లోపే పీఐఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది సరైన వస్త్రధారణతో విధులకు హాజరుకావాలని చెప్పడమే తమ ఉద్దేశమని, భావాన్ని వ్యక్తపరచడంలో ఎయిర్‌లైన్స్‌ అధికారులు విఫలమయ్యారని పీఐఏ చీఫ్‌ హెచ్‌ఆర్‌ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. సిబ్బంది మనసుల్ని నొప్పించినందు క్షమించాలని కోరారు. ‘‘ నేను వ్యక్తిగతంగా చాలా చింతిస్తున్నాను. అక్కడ వాడిన పదాలు సరిగా లేవు. సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా కొందరు దురదృష్టవశాత్తు ఈ అంశాన్ని ట్రోల్‌ చేయడం బాధాకరం’’ అని ఆయన  పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని