Masood Azhar: తాలిబన్లూ.. మసూద్‌ను వెతికి అరెస్టు చేయండి..!

అన్న జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్‌పై చర్యలు తీసుకోవాలని

Published : 15 Sep 2022 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను వెతికిపట్టుకోవాలని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ తాలిబన్లకు మంగళవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే మసూద్‌పై చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాక్‌పై ఒత్తిడి పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. 2019లో పుల్వామా దాడులకు మసూద్‌ అజర్‌ను మాస్టర్‌మైండ్‌ అన్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మొత్తం 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. మసూద్‌ ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని నంగ్రహార్‌ ప్రావిన్స్‌ లేదా కునార్‌ ప్రావిన్స్‌లో తలదాచుకొని ఉండొచ్చని పాక్‌ ఆ లేఖలో పేర్కొంది.

ఈ ఏడాది జూన్‌లో 30 మంది ఉగ్రవాదులను వెతికి వారిపై విచారణ జరపాలన్న భారత్‌ డిమాండ్‌కు ఎఫ్‌ఏటీఎఫ్‌లో పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ఈ ఉగ్రవాదుల్లో లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, ఆపరేటీవ్‌ సాజిద్‌ మిర్‌ కూడా ఉన్నారు. వీరు 2008 ముంబయి దాడులకు మాస్టర్‌ మైండ్లుగా పనిచేశారు. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై  పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 

వాస్తవానికి మసూద్‌ అజర్‌ను భారత్‌ గతంలోనే అరెస్టు చేసినా.. 1999లో విమానం హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. భారత్‌ ఇతడిని ఎప్పటి నుంచో అప్పగించమని కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని