Super Tax: పాక్‌లో ‘సూపర్‌’ పన్ను!

పాకిస్థాన్‌లో భారీ పరిశ్రమలపై ‘సూపర్‌ ట్యాక్స్‌’ విధిస్తూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ప్రకటన చేశారు. ఈమేరకు సిమెంటు, స్టీల్‌ వంటి పరిశ్రమలపై 10 శాతం ఈ పన్ను విధించారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, నగదు కొరత

Updated : 25 Jun 2022 09:52 IST

భారీ పరిశ్రమలపై 10 శాతం విధిస్తూ ప్రధాని ప్రకటన

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో భారీ పరిశ్రమలపై ‘సూపర్‌ ట్యాక్స్‌’ విధిస్తూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ప్రకటన చేశారు. ఈమేరకు సిమెంటు, స్టీల్‌ వంటి పరిశ్రమలపై 10 శాతం ఈ పన్ను విధించారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, నగదు కొరత నుంచి ఉపశమనానికి ఇది ఉపకరిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్‌ను రూపొందించేందుకు శుక్రవారం ఏర్పాటైన ఆర్థిక నిపుణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రధాన లక్ష్యం ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించడమని, తదుపరి దేశం దివాలా తీయకుండా కాపాడటమని వివరించారు. గ్యాస్‌, చమురు, రసాయనాలు, పంచదార, జౌళి, బ్యాంకింగ్‌, వాహన పరిశ్రమ, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ తదితర రంగాలకు కూడా ఈ సూపర్‌ట్యాక్స్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు. దేశం ఆర్థికంగా బలోపేతం కావడానికి లక్ష్యాలు, కార్యాచరణను ప్రధాని వివరిస్తూ ఇవి తప్పక సాధిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి పాకిస్థాన్‌ త్వరలో గాడిన పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంపన్నుల నుంచి పన్ను వసూలు చేసి పేదలకు సాయమందేలా చూడాలని సంబంధిత విభాగాలకు ఆయన సూచించారు. ఈ ప్రకటన అనంతరం పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కేఎస్‌ఈ-100 ఇండెక్స్‌ 4.81 శాతం పడిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని