Power Crisis: పాకిస్థాన్‌లో కరెంటు సంక్షోభం తీవ్రం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్..?
హెచ్చరించిన టెలికాం ఆపరేటర్లు
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో (Pakistan) కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్ కోతలు (Power Cuts) పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వస్తున్నట్లు పాకిస్థాన్ టెలికాం ఆపరేటర్లు హెచ్చరికలు జారీచేశారు.
‘దేశవ్యాప్తంగా చాలా గంటలపాటు కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో కార్యకలాపాల్లో సమస్యలు, ఆటంకాలు కలిగిస్తున్న దృష్ట్యా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని టెలికాం ఆపరేటర్లు హెచ్చరించారు’ అని పాకిస్థాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (NITB) పేర్కొంది. అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కూడా జులై నెలలో డిమాండుకు సరిపడా కరెంటును సరఫరా చేయలేకపోవచ్చని ముందే హెచ్చరించారు. దేశ అవసరాలకు సరిపడా ఎల్ఎన్జీ (LNG)ను పొందలేకపోవచ్చని.. అయినప్పటికీ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) కొనుగోలు కోసం పాకిస్థాన్ ఖతర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రతినెల అక్కడ నుంచి ఎల్ఎన్జీని కొనుగోలు చేస్తుంది. కానీ, డిమాండ్‌కు సరిపడా వనరులను పెంచకపోవడం, చెల్లింపులు చేసేందుకు ఇబ్బందులు తలెత్తడంతో వనరులను దిగుమతి చేసుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా చాలా గంటలపాటు కోతలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించడంతోపాటు మాల్స్, ఫ్యాక్టరీలు కూడా తొందరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రివేళల్లో వేడుకలపైనా ఇప్పటికే నిషేధం విధించింది.
ఇదిలాఉంటే, పాకిస్థాన్ రూపాయి విలువ రోజురోజుకు పతనమవడం, విదేశీ పెట్టుబడులు లేకపోవడం, విదేశీ రుణాల భారంతో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో విద్యుత్ కొరతతోపాటు ఇతర వస్తువుల దిగుమతుల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK : ఈ ఆల్‌రౌండరే.. భారత్ - పాక్ జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం!
-
General News
KTR: రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు భారత్ దిక్సూచి: కేటీఆర్
-
Movies News
Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
-
World News
Imran Khan: ర్యాలీలో వీడియో ప్లేచేసి.. భారత్‌ను ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్
-
General News
Andhra News: ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం
-
Movies News
Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్ చడ్డా’ వీక్షించిన సీఎం మాన్.. ఏమన్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?