Pakistan: పాక్‌ పీఎం కార్యాలయం.. సంభాషణలకు సురక్షితం కాదు..!

‘ముఖ్యమైన సంభాషణలకు’ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం సురక్షితమైన ప్రదేశం కాదని అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా హెచ్చరించేవారిని పీటీఐ నేత వెల్లడించారు.

Published : 30 Sep 2022 01:12 IST

ఆడియో లీకులపై పీటీఐ నేత కీలక వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రితో సహా పలువురు కీలక నేతలకు చెందిన వందకు పైగా ఆడియో క్లిప్‌లు డార్క్‌నెట్‌లో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ముఖ్యమైన సంభాషణలకు’ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం సురక్షితమైన ప్రదేశం కాదని అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా హెచ్చరించేవారిని పీటీఐ నేత, మాజీ మంత్రి వెల్లడించారు.

‘ఇక్కడ (ప్రధాని కార్యాలయంలో) మనం మాట్లాడుకున్న విషయాలు రికార్డవుతాయి, అనంతరం ఏదో ఒకరోజు లీక్‌ అవుతాయి’ అని అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వా చెప్పినట్లు ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్‌ చౌధరి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వీటి గుట్టు విప్పాలని సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఏదైనా కీలక విషయం మాట్లాడాలనుకున్నప్పుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బయటకు వచ్చి మాట్లాడేవారని జనరల్‌ బజ్వా చెప్పినట్లు ఫవాద్‌ చౌధరి వెల్లడించారు.

మరోవైపు, పాకిస్థాన్‌ ప్రధాని సహా కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్‌ ఒకటి డార్క్‌ వెబ్‌లో 3.50 లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని ఫవాద్‌ చౌధరి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు మొత్తం లండన్‌ నుంచి తీసుకుంటున్నట్లు ఈ ఆడియో క్లిప్‌లోని సంభాషణలను బట్టి అర్థమవుతుందన్నారు. వీటిపై స్పందించిన ప్రభుత్వం.. ఆడియో లీక్‌ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని