Shehbaz Sharif: మాట్లాడుతుంటే వ్యక్తి కేకలు.. భోజనం పెడతారు కూర్చోండన్న పాక్‌ ప్రధాని

ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో పాక్‌ ప్రధాని షరీఫ్‌కు వ్యతిరేకంగా ఓ వ్యక్తి కేకలు వేశాడు. దానికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Published : 28 Dec 2022 00:51 IST

ఇస్లామాబాద్‌: అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా అక్కడున్న ఓ వ్యక్తి కేకలు వేస్తూ అడ్డుపడ్డాడు. ఆ వెంటనే ప్రధాని అతడిని వారించిన తీరు నవ్వులు పూయిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను పలు వార్తా సంస్థలు ప్రచురించాయి. 

సోమవారం ఖైబర్‌ ఫక్తుంక్వా ప్రావిన్సులోని ప్రధాని షరీఫ్.. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యాక్రమాల గురించి వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ కూర్చున్నవారిలో నుంచి ఓ వ్యక్తి లేచి, గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో షరీఫ్ అతడికి కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ‘దయచేసి కూర్చోండి. కొద్దిసేపట్లో భోజనం పెడతారు ఆగండి’ అని చెప్పారు. తర్వాత చిరునవ్వు నవ్వి, తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని