Pakistan: ఇమ్రాన్ అరెస్టుతో ఘర్షణలు.. దారుణంగా పతనమైన పాక్ రూపాయి
పాకిస్థాన్ రూపాయి (Pakistan Rupee) విలువ దారుణంగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే పాక్ రూపీ మారకం విలువ 300 వద్ద జీవనకాల కనిష్ఠానికి దిగజారింది.
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టుతో పాక్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో ఘర్షణలను నియంత్రించేందుకు ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో డాలర్ (Dollar)తో పోలిస్తే పాక్ రూపాయి (Pakistan Rupee) మారకం విలువ 3.3శాతం కుంగి 300 వద్ద జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. 2031తో ముగియనున్న డాలర్ బాండ్ల విలువ అమాంతం పెరిగి 33.44 శాతానికి చేరింది.
అల్ ఖదీర్ భూ కుంభకోణం కేసులో ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అవినీతి నిరోధక కోర్టు ఆయనకు 8 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఇమ్రాన్ (Imran Khan) మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగడంతో ఆందోళనలను అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని పిలిచింది. దీంతో పాక్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే పాక్ (Pakistan) తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో మగ్గిపోతోంది. నిత్యావసర ధరలు భగ్గుమనడంతో తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విదేశీ మారకపు నిల్వలు కూడా నిండుకుంటున్నాయి. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు పాక్ చర్చలు జరుపుతున్నా అవి ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కన్పించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ అరెస్టుతో పాక్ రణరంగంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’