Pakisthan: అసమ్మతివాదులపై జీవితకాల వేటుకు సిద్ధమైన ఇమ్రాన్ ఖాన్

అవిశ్వాస తీర్మానంపై తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన సొంత పార్టీ చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధమయ్యారు.

Published : 22 Mar 2022 12:43 IST

ఇస్లామాబాద్‌: అవిశ్వాస తీర్మానంపై తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన సొంత పార్టీ చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధమయ్యారు. అసమ్మతివాదులపై జీవితకాల అనర్హత వేటువేస్తానని బెదిరిస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 63-ఏ ప్రకారం అసంతృప్త సభ్యులందరినీ అనర్హులుగా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి ఉందని పాకిస్థాన్ అటార్ని జనరల్ తెలిపారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న తమ సభ్యుల ఓట్లను.. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా వచ్చిన మొత్తం ఓట్లతో జోడించకూడదని ఆయన కోరారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు.. ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభాలకు బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష చట్టసభ్యులు ఈనెల 8న నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఎదుట అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానంపై ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు అధికారపార్టీకి చెందిన 24 మంది సభ్యులు ప్రకటించారు. ఈనెల 28న తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని