Pakistan: పతనం అంచున పాక్.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!
Pakistan forex exchange reserves: పాక్‌లో విదేశీ మారకం నిల్వలు భారీగా క్షీణించాయి. 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. కేవలం మూడు వారాల దిగుమతులకే ఆ దేశం వద్ద విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి.
కరాచీ: పొరుగు దేశం పాకిస్థాన్(Pakistan) నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు (Forex exchange reserves) భారీగా క్షీణించి 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. బుధవారం నాటికి విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రుణ చెల్లింపుల వల్ల 592 మిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు క్షీణించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఆ దేశ కమర్షియల్ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్ డాలర్లతో కలుపుకొంటే మొత్తం విదేశీ మారకపు నిల్వలలు 8.74 బిలియన్ డాలర్లు పాక్ వద్ద ఉన్నాయి.
మరోవైపు, నగదు కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుంచి నిధులు పొందేందుకు నానా తంటాలు పడుతోంది. ఒకసారి 7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ మంజూరు చేస్తే.. ఇతర వేదికల నుంచి, స్నేహ పూర్వక దేశాల నుంచి నిధులు పొందేందుకు పాక్‌కు వీలవుతుంది. ఇప్పటికే నిధుల విడుదలకు ఐఎంఎఫ్ కొన్ని షరతులు విధించింది. చమురు సబ్సిడీల్లో కోత పెట్టాలని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారకపు విలువను సవరించాలని సూచించింది. ఈ రెండింటికీ ఇప్పటికే పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చమురు ధరలను ఏకంగా 16 శాతం మేర పెంచింది. రూపాయి మారకంపై ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ బ్యాంక్ మార్కెట్‌లో పాక్ రూపాయి విలువ 270 వద్ద ట్రేడవుతోంది.
ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గాల్సిందే: షరీఫ్
నగదు కొరత నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టే షరతులను అంగీకరించాల్సి వస్తోందని స్వయాన ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ‘పూర్తి వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదు. కానీ దేశంలో ఆర్థిక సవాళ్లు ఊహకందని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ విధించిన ఆచరణ సాధ్యంకాని షరతులను అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని షరీఫ్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్