Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
అమెరికా అణ్వాయుధ కేంద్రాలపై నిఘా కోసం చైనా వదిలిన బెలూన్ను గుర్తించారు. దీంతో అమెరికా దీనిని కూల్చేందుకు యుద్ధ విమానాలను సిద్ధం చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని అణు స్థావరంపై చైనా వదిలిన ఓ భారీ హై ఆల్టిట్యూడ్ బెలూన్ను గుర్తించారు. ఈ విషయాన్ని పెంటగాన్ స్వయంగా వెల్లడించింది. ఈ బెలూన్ను అమెరికా నిఘా వర్గాలు కొంతకాలంగా ట్రాక్ చేస్తున్నాయి. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే పైన ఇది ప్రయాణిస్తోందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ పేర్కొన్నారు. అది ఉత్తర అమెరికా గగనతలంలో ప్రయాణిస్తోంది. దీనిని కూల్చేస్తే శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్ అధికారులు.. అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. దీంతో పాటు తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. ప్రస్తుతం ఈ బెలూన్ అమెరికాలోని చాలా కీలక ప్రదేశాల మీదుగా ఎగురుతోందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా పెద్దగా ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కాకపోవచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అణు బొరియలపై నిఘా..
బుధవారం ఈ బెలూన్ను మోంటానాపై గుర్తించారు. ఇది కెనడాను దాటుకొని అలాస్కా గగనతలంపై ఎగురుతోంది. శ్వేత సౌధం నుంచి ఆదేశాలు రాగానే దీనిని కూల్చివేసేందుకు ఇప్పటికే ఎఫ్-22 సహా ఇతర ఫైట్ జెట్లను సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో మోంటానా కూడా ఒకటి. అమెరికాలో ఉన్న మూడు భూగర్భ అణు క్షిపణి స్థావరాల్లో ఒకటి ఇక్కడే మాల్మ్‌స్ట్రోమ్ వైమానిక స్థావరం వద్ద ఉంది. ఈ నిఘా బెలూన్ దానిపై నుంచి ఎగిరి ఉంటుందని తాము భావిస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ బెలూన్ విషయాన్ని అమెరికా అధికారులు వాషింగ్టన్ డీసీలోని చైనా దౌత్య సిబ్బందికి తెలిపారు. ప్రస్తుతం బెలూన్ లొకేషన్‌ను పెంటాగాన్ గోప్యంగా ఉంచింది. గతంలో కూడా ఇలా బెలూన్లతో నిఘా సమాచారం సేకరించిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఈ సారి మాత్రం ఈ బెలూన్ చాలా కాలం పాటు అమెరికా గగనతలంలోనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..