Lumberjack ride: హఠాత్తుగా ఆగిన లాంబర్‌జాక్‌.. గాల్లో వేలాడిన సందర్శకులు

సరదాగా గడిపేందుకు పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..  

Updated : 26 Sep 2023 12:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన ‘లాంబర్‌జాక్‌ రైడ్‌’ (Lumberjack ride) ఆకస్మికంగా ఆగిపోవడంతో వారంతా గాల్లో తలకిందులుగా వేలాడారు. ఈ ఘటన కెనడా (Canada)లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఒంటారియోలోని ‘వండర్‌ల్యాండ్‌’ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో కొందరు సందర్శకులు లాంబర్‌జాక్‌ రైడ్‌ ఎక్కారు. పైకి వెళ్లిన కాసేపటికి అది హఠాత్తుగా ఆగిపోయింది. అందులో చిక్కుకుపోయిన వారంతా దాదాపు 30 నిమిషాలపాటు గాల్లో తలకిందులుగా వేలాడారు. భయాందోళనకు గురై కాపాడండి అంటూ కేకలు వేశారు. దానిలో చిక్కుకుపోయిన కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి అసలు విషయం తెలిసి..

‘‘రైడ్‌లో భాగంగా సందర్శకులు ఎక్కిన లాంబర్‌జాక్‌ పైకి వెళ్లాక ఆకస్మికంగా ఆగిపోయింది. కాసేటికి సందర్శకులను సురక్షితంగా కిందకు దించాం. శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది’’ అని పార్క్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదకర ఘటన చోటు చేసుకోవడంతో పార్క్‌ను కొన్ని రోజుల పాటు మూసి వేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని