Updated : 10 Jun 2022 19:20 IST

Musharraf: పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

దుబాయి: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గత మూడు వారాలుగా దుబాయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముషారఫ్‌ ప్రస్తుతం వెంటిలేటర్‌పై లేరని.. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోవడానికి సాధ్యం కానంత క్లిష్టంగా మారిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయడంలేదన్నారు. ముషారఫ్‌ కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ముషారఫ్‌ వయస్సు 78 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న దిల్లీలో జన్మించిన ముషారఫ్‌.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.  ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్‌ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్‌.. 1999లో నవాజ్‌ షరీఫ్‌ సర్కార్‌పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్నారు. కార్గిల్‌ యుద్ధానికి ముషారఫ్‌ ప్రధాన కారకుడు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని