Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని శుక్రవారం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.

Updated : 28 Jan 2023 08:27 IST

లాహోర్‌: ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని శుక్రవారం పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. సింధ్‌ ప్రభుత్వం నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తనను చంపడానికి జర్దారీ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై దాడికి కుట్ర పన్నిన వారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు ప్లాన్‌ ‘సి’ అమలు చేస్తున్నారు. దీని వెనుక ఆసిఫ్‌ జర్దారీ ఉన్నారు. అతని దగ్గర లెక్కలేనంత అవినీతి సొమ్ము ఉంది. ఆ డబ్బును ఆయన ఓ ఉగ్రసంస్థకు ఇచ్చారు. ఈ మొత్తం కుట్రలో శక్తిమంతమైన ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని