G7 Summit: ఇటలీకి పయనమైన ప్రధాని మోదీ.. మూడో హయాంలో తొలి విదేశీ పర్యటన

జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇటలీకి పయనమయ్యారు.

Updated : 13 Jun 2024 20:44 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన జీ7 దేశాల వార్షిక సదస్సులో (G7 summit) ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. దీనిపై ఆయన హర్షం వ్యక్తంచేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!

ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జీ7 దేశాల సదస్సు (జూన్‌ 13-15) ప్రారంభమైంది. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్‌, ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌, జపాన్‌, కెనడా, బ్రిటన్‌ ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్‌ ట్రూడో, రిషి సునాక్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ తదితర నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. జార్జియా మెలోనీ వారికి స్వాగతం పలికారు. ఇదిలాఉండగా.. గతేడాది జపాన్‌లోని హిరోషిమా వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సుకు మోదీ హాజరైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు